మణుగూరు కండక్టర్ ప్రవల్లిక మృతికి కోదాడ ఆర్టీసీ డిపోలో ఘన నివాళులు

Sakshitha news

మణుగూరు కండక్టర్ ప్రవల్లిక మృతికి కోదాడ ఆర్టీసీ డిపోలో ఘన నివాళులు

*తోటి ఉద్యోగిని కోల్పోవడంతో విషాదంలో ఆర్టీసీ కార్మికులు..

చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు, మౌనం పాటించి సంతాపం తెలియజేశారు.

సూర్యాపేట జిల్లా /కోదాడ : సాక్షిత

కోదాడ మణుగూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న జి. ప్రవల్లిక మృతి పట్ల కోదాడ ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోదాడ ఆర్టీసీ డిపో ఆవరణలో ప్రవల్లిక చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కొద్దిసేపు మౌనం పాటించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థలో విధులు నిర్వహిస్తున్న తోటి ఉద్యోగిని అకాలంగా మృతి చెందడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్త…