చిలుకూరుకు నవంబర్ 6న డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రాక

Sakshitha news

చిలుకూరుకు నవంబర్ 6న డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రాక

భీమ్ హోమ్ నిర్మాణానికి శంకుస్థాపన
సూర్యాపేట జిల్లా /చిలుకూరు నవంబర్ 03 (సాక్షిత న్యూస్)
చిలుకూరు: సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని స్వేరోస్ కుటుంబ సభ్యులకు శుభవార్త. చిలుకూరు మండల కేంద్రంలో జిల్లా స్వేరోస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న భీమ్ హోమ్ భవన నిర్మాణానికి నవంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి స్వేరోస్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా కోదాడ నియోజకవర్గంలోని స్వేరోస్ కుటుంబ సభ్యులు, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అభిమానులు, జిల్లా పీపీఎల్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు పిడమర్తి దశరథ స్వేరో కోరారు.