292 డివిజన్, సాయిబాబా నగర్ పరిధిలోని కాలనీల సమస్యలపై సీనియర్ BRS నాయకులు

Sakshitha news

292 డివిజన్, సాయిబాబా నగర్ పరిధిలోని కాలనీల సమస్యలపై సీనియర్ BRS నాయకులు వారాల వినోద్ కుమార్ ని కలిసిన కాలనీవాసులు

292 డివిజన్, సాయిబాబా నగర్ పరిధికి చెందిన రాజుల స్వామి నగర్, దయానంద్ నగర్, మైత్రి నగర్ కాలనీలలో నెలకొన్న పలు సమస్యలపై ఆయా కాలనీల వాసులు సీనియర్ BRS నాయకులు వారాల వినోద్ కుమార్ ని కలవడం జరిగింది.

ఈ సందర్భంగా కాలనీవాసులు తమ కాలనీలలో ఉన్న డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, మంచినీటి సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై స్పందించిన వారాల వినోద్ కుమార్ గారు, ఈ సమస్యలన్నింటినీ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మైత్రి నగర్ ప్రెసిడెంట్ గట్టు అశోక్, రాజు యాదవ్, కావాలి రవి, ముదిరాజ్ లక్ష్మణ్, గజ్జల రమేష్ తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, కాలనీవాసులు పాల్గొనడం జరిగింద