మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం – వెంకటేష్ గౌడ్

Sakshitha news

మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం – వెంకటేష్ గౌడ్

ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని తారకరామ్ నగర్ లో ఉన్న దర్గాలో సీనియర్ నాయకులు సమ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన పవిత్ర గ్యార్వీ షరీఫ్ కార్యక్రమానికి ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్యాతిదిగా హాజరై ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం అని, అందరూ సామరస్యంగా జరుపుకునే వేడుక అని అన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ అన్ని పండగలు కలిసిమెలసి జరుపుకోవాలని తెలియచేశారు. విభిన్న మతాలు, భిన్న విశ్వాసాలు మన సమాజానికి బలమే కానీ విభజనకు కారణం కాకూడదని అన్నారు. ప్రేమ, శాంతి, సోదరభావం, పరస్పర గౌరవమే సమాజ అభివృద్ధికి పునాదని తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. ఈ కార్యక్రమంలో పోశెట్టిగౌడ్, నిరుడి రాజు, శౌకత్ అలీ మున్నా, ముస్లిం సోదరులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.