కొండపల్లిలో జోరుగా సాగుతున్న కూటమి ఎన్నికల ప్రచారం:

Sakshitha news

కొండపల్లిలో జోరుగా సాగుతున్న కూటమి ఎన్నికల ప్రచారం: ఓటర్లను అభ్యర్థించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.

ఎన్టీఆర్ జిల్లా.
కొండపల్లి (ఇబ్రహీంపట్నం):

కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 21వ డివిజన్‌లో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ ప్రచారంలో 21వ డివిజన్ కూటమి కౌన్సిలర్ అభ్యర్థి పులి అరుణకుమారితో కలిసి ఆయన ప్రతి ఇంటినీ సందర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్థానిక ప్రజలతో మమేకమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

డివిజన్ పరిధిలోని రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనతో పాటు వార్డు సమగ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వ హయాంలో జరగబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు వివరించారు.

మున్సిపాలిటీ సమగ్ర వికాసం కోసం కూటమి కౌన్సిలర్ అభ్యర్థి పులి అరుణకుమారికి, అలాగే చైర్మన్ అభ్యర్థి కన్నెకంటి అమూల్యకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి పులి అరుణకుమారి మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే డివిజన్ సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమానికి స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ప్రచారంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన, బీజేపీలకు చెందిన స్థానిక ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.