సిరిసిల్లలో భారీ బహిరంగ సభ లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు రూ.350 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి , రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
