VRAల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: రాజేంద్ర ప్రసాద్ హామీ .

Sakshitha news

VRAల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: రాజేంద్ర ప్రసాద్ హామీ .

తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న VRA లు ఈరోజు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ని కలుసుకుని తమ సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని రాజేంద్రప్రసాద్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…

VRAలు ఎదుర్కొంటున్న ఉద్యోగ, సేవా సంబంధిత సమస్యలు తన దృష్టికి వచ్చాయని ఎన్నో సంవత్సరాలుగా గ్రామస్థాయిలో ప్రజలకు సేవలందిస్తున్న VRAల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు

VRAల ఆవేదనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాజేంద్ర ప్రసాద్ వీఆర్ఏలకు హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యను కేవలం ఒక వర్గం సమస్యగా కాకుండా, వారి కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా పరిగణించి పరిష్కారం చూపేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు సానుభూతితో తప్పక పరిశీలిస్తారని రాజేంద్ర ప్రసాద్ భరోసా ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో VRA లా సంఘం ఉయ్యూరు మండలం కంకిపాడు మండలాలకు చెందిన నాయకులు, VRA లు పాల్గొన్నా రు….