ప్రజా సమస్యలను పరిష్కరించండి.

Sakshitha news

ప్రజా సమస్యలను పరిష్కరించండి.
డిప్యూటీ కమిషనర్ కి సిపిఐ నాయకులు వినతి.

జగద్గిరిగుట్టలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో అనేక వినతి పత్రాలు ఇస్తే ఇప్పటికీ ఆ కల సాకారమైందని ఈ ప్రాంత అభివృద్ధి కోసమే సిపిఐ ఎల్లప్పుడూ పనిచేస్తుందని మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములై జగద్గిరిగుట్టను అభివృద్ధి చేయాలని కోరుతూ నేడు మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కి సిపిఐ నాయకులు సన్మానించి జగద్గిరిగుట్ట లో నెలకోన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏసురత్నం మండల సహాయ కార్యదర్శి హరినాథ్ రావు, రాములు ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు, యువజన సంఘం కార్యదర్శి కీర్తి సిపిఐ నాయకులు సదానందం, సహదేవరెడ్డి ,
కే వెంకటేష్, జానకి రాములు తదితరులు పాల్గొన్నారు.