ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల’కు దరఖాస్తుల గడువు పొడిగింపు

Sakshitha news

అమరావతి : ‘ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల’కు దరఖాస్తుల గడువు పొడిగింపు.

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల దరఖాస్తుల గడువును సెప్టెంబర్‌ 18 వరకు పొడిగించిన ప్రభుత్వం.

అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకే మరో రెండు రోజులు గడువు పెంచినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

గతంలో సెప్టెంబర్‌ 7 నుంచి 16 వరకు ఉన్న గడువును 18వ తేదీ వరకు పొడిగింపు.

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి.

స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణతో పాటు ఈ-కేవైసీకి పూర్తి ఏర్పాట్లు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు అనంతరం అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రం అందజేత.

రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్టీఆర్‌ భరోసా ద్వారా 62 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నాము.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ గడువు పొడిగింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి.

: మంత్రి కొండపల్లి శ్రీనివాస్