వించిపేట ప్రజలకు రైతుబజారుని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్….జి.కోటేశ్వరరావు
సాక్షిత : వించిపేట ప్రజలకు అందుబాటులోకి రైతుబజారుని తీసుకోని రావాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ 49,50,54 మరియు 55వ డివిజన్ల ఆధ్వర్యంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు తాడి పైడయ్య అధ్యక్షతన 174 , 186 సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కామ్రేడ్ జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భముగా కోటేశ్వరరావు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే పాతబస్తీ, వించిపేట ప్రాతంలోని ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలకు తాజా కూరగాయలు అందించేందుకు 2017 లో అప్పటి నగరపాలక సంస్థ పాలక పక్షం వారు 40 లక్షల అంచనా వ్యయంతో జి+1 ప్రాతిపదికన మొదటి అంతస్థు ఈ-సేవ కేంద్రానికి, గ్రౌండ్ ఫ్లోర్ రైతు బజార్ కు నిర్మాణానికి శంకుస్థాపన చేసి తరువాత కాలంలో నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది. మొదటి అంతస్థును గతంలోని వైసిపి ప్రభుత్వం సచివాలయాలకి కేటాయించి అందుబాటులోకి తీసుకోని వచ్చినప్పటికీ, రైతు బజార్ కి ఉద్దేశించిన గ్రౌడ్ ఫ్లోర్లో మాత్రం రైతు బజారు షాపులకు లబ్దిదారులను ఎంపిక చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల నేటికీ రైతు బజారులో షాపులు కేటాయింపులు జరుగక రైతుబజారు ప్రారంభం కాకపోవడం వల్ల ఈ ప్రాంగణం నిరుపయోగంగా మారి సాయంత్రం వేళా సాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారిన పరిస్థితి నెలకొనడం అధికారుల అలసత్వానికి నిదర్శనం అని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం, మున్సిపల్ కమిషనర్ మరియు జిల్లా కలెక్టర్ స్పందించి రైతు బజారు షాపులకు లబ్దిదారులను గుర్తించి వారికీ తక్షణమే షాపులను కేటాయించి రైతు బజారు ప్రారంభానికి అధికారులను చర్యలు చేపట్టాలని లేని పక్షంలో వివిధ స్థాయిలలో అధికారుపై ఒత్తిడి చేసేందుకు కావాల్సిన ఉద్యమానికి స్థానిక నాయకత్వానికి సిపిఐ విజయవాడ నగర సమితి తరపున పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నగర పార్టీ నాయకులు బోర రామకృష్ణ, మోకా దుర్గారావు (చిన్న), మురుగేషన్ రాము, పగిదికత్తుల రాము, నగర యువజన సమాఖ్య నాయకులు కంచర్ల భార్గవ్, లంకె సాయి, స్థానిక డివిజన్ పార్టీ నాయకులు పిట్టా అప్పారావు, తుపాకుల ప్రతాప్, ఎస్.కె. సిద్ధిక్, బల్ల నరసింహరాజు, తిప్పాబాతుల వెంకటేశ్వరరావు, కాగితాల కనకారావు, టంగుటూరు ధనుంజయ్ కుమార్, బోర రాము, సయ్యద్ హాకిమ్, పీత శేఖర్, పెద్దాడ బాబ్జి, పోరంకి చిన్నారావు, తుపాకుల నాగేశ్వరరావు, చెక్క తిలక్ వర్మ, వడుగు శ్రీనివాసరావు, మితింటి గోపికృష్ణ, కర్రీ రాజేష్, బాబురావు, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
