నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు…

Sakshitha news

నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు….

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి…

— మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్…

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, భీమారం/ : వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల జోన్, జైపూర్ సబ్‌డివిజన్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది కిట్ సామగ్రి, యూనిఫాం, క్రమశిక్షణ తదితర అంశాలను డీసీపీ పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారి విధుల నిర్వహణ, పనితీరు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, ముఖ్యమైన రికార్డులు, కేసు దస్త్రాలను పరిశీలించారు.

పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు, కేసులను సకాలంలో పరిష్కరించాలని డీసీపీ అధికారులను ఆదేశించారు. కేసులు, ఇతర వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, న్యాయస్థానాలతో సమన్వయంతో పనిచేస్తూ నిందితులకు శిక్ష పడేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, బాధితులకు రక్షణ కల్పించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని డీసీపీ ఎ. భాస్కర్ పేర్కొన్నారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. నేరాల నివారణకు నిరంతరం కృషి చేయాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని ఆదేశించారు.

ఈ తనిఖీలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ నవీన్, ఎస్‌ఐ రాజేందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top