రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం…
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ప్రభుత్వ విప్ విజయరమణ రావు ఘన నివాళి….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : భారతరత్న, స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు భూతగడ్డ సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పాల్గొని గాంధీ విగ్రహం వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువతకు రాజకీయాల్లో, దేశ నిర్మాణంలో ప్రాధాన్యత కల్పించడంతో పాటు సాంకేతిక రంగంలో భారతదేశం ముందుకు సాగేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఎంతో ప్రయోజనం చేకూర్చాయని పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవలో ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, కల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, కౌన్సిలర్ ఉండ సరస్వతి, కొమ్ము సుధాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, రాజు, పలువురు కౌన్సిలర్లు, పట్టణ, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
