రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గిరి నగర్ డివిజన్‌లోని ఐడీపీఎల్ చౌరస్తా వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు బుయ్యని శివకుమార్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారతరత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ మరియు జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి , మాజీ కార్పొరేటర్ కె.ఎం. గౌరీష్ ముఖ్య అతిథులుగా పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని నేతలు కేక్ కట్ చేసి, ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆర్. లక్ష్మి, సీనియర్ నాయకులు జేమ్స్, బేకు శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముద్దాపురం శ్రీకాంత్ గౌడ్, పాలకృష్ణ, జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కావలి చంద్రయ్య, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎస్సీ సెల్ చైర్మన్ బొట్ల విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు కనకరావు, జలీల్ ఖాన్, బండి శ్రీనివాస్ గౌడ్, ఇరుగు రాధాకృష్ణ, జక్కుల మల్లేష్ యాదవ్, మైసిగారి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు గణేష్, జాకీర్, మేకల ఎల్లయ్య, పాషా తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
