కోదాడ పట్టణంలో ‘అరైవ్ – అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాలు

Sakshitha news

కోదాడ పట్టణంలో ‘అరైవ్ – అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాలు
మీ భద్రతే – మా బాధ్యత

సాక్షిత సూర్యాపేట జిల్లా/
కోదాడ పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో NRS జూనియర్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ‘అరైవ్ – అలైవ్’ నినాదంతో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, హెల్మెట్ ధరించడం, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
అదేవిధంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, విద్యార్థుల భవిష్యత్తుపై వాటి ప్రభావం గురించి వివరించారు. పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచి, అక్రమ మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


విద్యార్థినుల భద్రత కోసం షీ టీం ‘పోలీస్ అక్క’ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, వేధింపులు లేదా ఇతర సమస్యలు ఎదురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల భద్రత పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచి, మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కోదాడ టౌన్ ఎస్సై ఉపేందర్ రెడ్డి, కోదాడ టౌన్ ఎస్సై మల్సూర్, ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి, పోలీస్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top