జ్ఞాపకాలను పదిలపరిచే కళకు వందనం
187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మద్దిరాలలో ఘనంగా వేడుకలు
మద్దిరాల, సాక్షిత ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో):
ప్రపంచానికి ఫోటోగ్రఫీ కళను పరిచయం చేసి, ఆ రంగానికి బలమైన పునాది వేసిన ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యూరెను స్మరించుకుంటూ 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను మద్దిరాల మండల కేంద్రంలో ఫోటో, వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంఘం అధ్యక్షుడు రాగిరి మల్లేష్ గౌడ్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది కేవలం చిత్రాలను బంధించే ప్రక్రియ మాత్రమే కాదని, జీవితంలోని మధుర జ్ఞాపకాలు, చారిత్రక సంఘటనలు, సామాజిక మార్పులను భవిష్యత్ తరాలకు అందించే అద్భుతమైన కళ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రఫీకి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో లూయిస్ డాగ్యూరె చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ, ఫోటోగ్రఫీ కళ తన ప్రత్యేకతను ఏమాత్రం కోల్పోలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి నారాయణ, కోశాధికారి ఆకుల నరేష్, రామలింగం, వెంకన్న, శేఖర్, అశోక్, సంతోష్, చలం, సంపత్, ప్రభాకర్, లింగయ్య, రవి తదితర ఫోటో, వీడియో గ్రాఫర్లు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
