పాఠశాలలో క్రీడా సదుపాయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

Sakshitha news

పాఠశాలలో క్రీడా సదుపాయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అశ్వారావుపేట సాక్షిత :
నియోజకవర్గం, దమ్మపేట మండల పరిధిలోని నందిపాడు గ్రామంలో నేను సైతం చేయూత కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా సదుపాయాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందిపాడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం లయన్స్ క్లబ్ సౌజన్యంతో అందించిన గేమ్‌కిట్లతో పాటు ఉయ్యాలలు, జారుడు బల్లలు మరియు వివిధ రకాల ఆట వస్తువులను స్వయంగా తమ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన క్రీడా వసతులను పరిశీలించి, ఆటపాటలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు క్రీడా వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయమని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం దాతలు, సేవా సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు మరియు గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top