సాంప్రదాయ బద్ధంగా సీతారామ కళ్యాణం
స్వామివారికి, తలంబ్రాలు వస్త్రాలు, పూజ సామాన్లు, సమర్పించుకున్న ఆర్యవైశ్య మహిళలు
నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు ఆంజనేయస్వామి దేవస్థానంలో సీతారామ కళ్యాణముకు ఆర్యవైశ్య మహిళలు అందరూ కలిసి స్వామివారికి తలంబ్రాలు, వస్త్రాలు, మరియు పూజా సామాన్లు, ప్రసాదాలు, మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో, సాంప్రదాయబద్ధంగా మహాలక్ష్మి దేవస్థానం లో పూజలు చేయించి తదుపరి ఊరేగింపుగా రాముల వారి దేవస్థానం లోకి తీసుకుని పోయి రాముల వారి ఆశీర్వాదం తీసుకుని అక్కడ పూజలు చేయించి అనంతరం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించడం జరిగింది. కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించిన భక్తజనం. ఈ కార్యక్రమంలో వేద పండితులు,ఆర్యవైశ్య సంఘం మహిళలు, మరియు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం సెక్రెటరీ మెంటా రమేష్ బాబు, భక్తజనం పాల్గొనడం జరిగింది…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
