గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
సాక్షిత సూర్యాపేట జిల్లా /కోదాడ:పేద ప్రజలకు అండగా నిలిచే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసివేయాలని చూస్తుంది కోదాడ పట్టణంలోని బస్టాండ్ సెంటర్ గాంధీ విగ్రహం వద్ద కేటీఆర్ పిలుపుమేరకు నిరసన చేపట్టి గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, స్థానిక మహిళలు, బి ఆర్ ఎస్ నాయకులు.ఈ కార్యక్రమంలో మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కెసిఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డలకు ఆసరాగా నిలిచే పథకం అలాంటి పథకాన్ని కెసిఆర్ ప్రవేశపెట్టారని దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాన్ని తీసివేయాలని చూస్తుంది.కళ్యాణ లక్ష్మి పథకం తీసివేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతాము .గత ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మి పథకం లక్ష రూపాయలు తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అది అమలు చేసిన దాఖలాలు లేవు
ఈరోజు ఉన్న పథకాన్ని కూడా ఎత్తివేయాలని చూస్తున్నారు, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని తీసివేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామన్నారు.


