ఉట్నూర్‌లో PAC సమావేశాల్లో దిశానిర్దేశం చేసిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
ఉట్నూర్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాలకు సంబంధించిన PAC సమావేశాలు ఉట్నూర్‌లోని GNR ఫంక్షన్ హాల్లో, ITDA సమీపంలో నిర్వహించారు. ఈ సమావేశాల్లో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆసిఫాబాద్, 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆదిలాబాద్, 12 గంటల నుంచి 1 గంట వరకు నిర్మల్, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మంచిర్యాల PAC సమావేశాలు జరిగాయి.
ఈ సమావేశాల్లో ఆయా జిల్లాల రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటం తదితర అంశాలపై చర్చించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ వంశీకృష్ణ సూచించారు.
ఈ సమావేశాలకు AICC కార్యదర్శి సచిన్ సావంత్ , మంత్రి జూపల్లి కృష్ణారావు , ఆయా జిల్లాల DCC అధ్యక్షులు, PAC చైర్పర్సన్లు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.
పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీ వంశీకృష్ణ పిలుపునిచ్చారు.


