యాదాద్రి భువనగిరి జిల్లాలో PAC సమావేశం

Sakshitha news

యాదాద్రి భువనగిరి జిల్లాలో PAC సమావేశం.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని న్యూ వివేర హోటల్‌లో యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కాంగ్రెస్ పార్టీ PAC (Political Affairs Committee–రాజకీయ వ్యవహారాల కమిటీ) సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి శ్రీమతి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు.

మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో పార్టీ సంస్థాగత బలోపేతం, రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ,యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమావేశంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నాయకులు సూచించారు.

Scroll to Top