ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం
-శుద్ధ జల ప్లాంట్ను ప్రారంభించిన ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
బాపట్ల రూరల్ :
ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన తాగునీటిని అందించడమే లక్ష్యమని బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు.
బాపట్ల రూరల్ మండలం, నందిరాజు తోటలో లుక్క శ్రీనివాసరావు, నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నాగలక్ష్మి’ శుద్ధ జల ప్లాంట్ను సోమవారం స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన తాగునీటిని అందించడంలో ఎలాంటి రాజీ పడకూడదని నిర్వాహకులకు సూచించారు. నాణ్యతా ప్రమాణాలను నిరంతరం పాటిస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సేవా దృక్పథంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
శుద్ధమైన తాగునీరు ప్రజల ఆరోగ్యానికి ఎంతో కీలకమని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ‘నాగలక్ష్మి’ శుద్ధ జల ప్లాంట్ నిర్వాహకులు మంచి సేవలందిస్తూ మరింత అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తాత జయప్రకాష్ నారాయణ, కందుల బాల కోటేశ్వరరావు, పరిశా గోపి, జంపని చలమయ్య, బలగాని శ్రీను, అనగాని బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.


