ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయనిధి

Sakshitha news

ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయనిధి

చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

ఆప్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు

ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఆపన్న హస్తానందిస్తోందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చూపుతున్న చొరవ ఎనలేనిదని కొనియాడారు.

చిత్తూరు, లక్ష్మీ నగర్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ,.. 704989 విలువచేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆప్తులకు అందించి వారిలో భరోసానింపారు. బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కష్టాలలో ఉన్న వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారాయన.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పొందిన బాధిత కుటుంబాలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Scroll to Top