PGRS కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించి ఉత్తమ పోలీస్ సేవలు అందించడం లక్ష్యం – పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ ,.//
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరీ ఐపిఎస్ ,.
PGRS లో ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, పలు మోసాలకు సంబంధించిన సమస్యలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి పలు అంశాలకు సంబంధించిన 87 ఫిర్యాదులను ప్రజలు పోలీస్ అధికారికి అందజేయగా,వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించే పోలీస్ అధికారులకు వాటిని రిఫర్ చేయడం జరిగింది.
PGRS లో వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించి,క్షేత్రస్థాయిలో విచారణ వేగవంతం చేసి, చట్ట ప్రకారం వారికి న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు అదనపు ఎస్పీ గారు సూచించారు.
PGRS లో తమ సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలకు వాటిని రాసి పెట్టడం లో సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
