ఎన్టిపిసి లో పదవీ విరమణ చేసిన వైద్య కార్డు దారులకు మెరుగైన వైద్య సేవలు…..

Sakshitha news

ఎన్టిపిసి లో పదవీ విరమణ చేసిన వైద్య కార్డు దారులకు మెరుగైన వైద్య సేవలు…..

–సిఎంఓ డాక్టర్ ఐ.ఆర్. లహరి….

సాక్షిత న్యూస్ పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి,రామగుండం ఎన్టిపిసి/ :
ఎన్‌టిపిసి రేవా కార్యనిర్వాహక సభ్యులు ఎన్‌టిపిసి రేవా ముఖ్య వైద్య అధికారి డాక్టర్ ఐ.ఆర్. లహరిని ఆయన కార్యాలయంలో కలిశారు. జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా డాక్టర్ లహరిని అభినందించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన వైద్య కార్డు దారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కార్యనిర్వాహక సభ్యులు ముఖ్య వైద్య అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చేరిన పదవీ విరమణ చేసిన వైద్య కార్డు దారులకు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులను అందించడం, ఆసుపత్రి ప్రాంగణంలోని బాహ్య రోగుల విభాగంలో హోమియోపతి మందులు అందుబాటులో ఉంచడం, ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలు అందించడం వంటి అంశాలపై చర్చించారు.

ఈ సమస్యలపై ముఖ్య వైద్య అధికారి డాక్టర్ ఐ.ఆర్. లహరి సానుకూలంగా స్పందించారు. పదవీ విరమణ అనంతరం వైద్య కార్డు దారులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో అధ్యక్షులు ఆకుల రాంకిషన్, కార్యదర్శి చెప్యాల శ్రీపతిరావు, రేవా సీనియర్ నాయకులు దుర్గం నర్సయ్య, మంగళంపల్లి రామ్ నారాయణ, హర్కర వేణుగోపాల్ రెడ్డి, జూపాక కొమురయ్య, కొమ్ము గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top