స్వాతంత్ర్య వేడుకలను వైభవంగా నిర్వహించాలి….

Sakshitha news

స్వాతంత్ర్య వేడుకలను వైభవంగా నిర్వహించాలి….

ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, : జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా, వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అధికారులను ఆదేశించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు డీసీపీ రామ్ రెడ్డితో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా వేడుకల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను, భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలన్నారు.

అనంతరం పెరేడ్ నిర్వహణకు సంబంధించి కొనసాగుతున్న రిహార్సల్స్‌ను అదనపు కలెక్టర్ పరిశీలించారు. వేడుకల విజయవంతమైన నిర్వహణ కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి. గంగయ్య, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top