కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
కాంగ్రెస్ పార్టీ ని వీడి టిఆర్ఎస్ పార్టీలో చేరిన 50 కుటుంబాలు
కండువాలు కప్పి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా
నేనున్నానంటూ భరోసా
మమ్మల్ని పట్టించుకునే నాధుడు లేదంటున్న గుమ్మడివల్లి రైతులు
3.5కోట్లు ఏం చేశారో చెప్పాలని డిమాండ్
అశ్వారావుపేట సాక్షిత :
అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు.
1)- కావడిగుండ్ల – కాలానికి చెందిన 50 కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబాలు మెచ్చా సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
2)- కొత్తకన్నాయిగూడెం(గ్రామం)లో ముత్యాలమ్మ తల్లి జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మళ్ళీ MLA అయ్యి ఈ గ్రామానికి రావాలని గ్రామ మహిళలు కాంక్షించారు.అనంతరం అదే గ్రామంలో సోడెం పూర్ణ చందర్ రావు రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోని పరామర్శించారు.
3)- అనంతారం(గ్రామం)లో చిన్న రాయుడు ని, కూరం రవీందర్ ని, నారిని మురళి గారిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని కాంక్షించారు.(మాజీ ఎంపీపీ బరగడ కృష్ణ ,కిషోర్ తదితరులు ఉన్నారు)
4)- గుమ్మడివల్లి(గ్రామం)లో తుమ్మల నాగేశ్వరరావు సతీమణి పుట్టా సత్యం ఇటీవలే ఆపరేషన్ చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోని పరామర్శించి త్వరగా కోలుకోవాలని కాంక్షించారు.(చిమడబోయిన పెద్ద వెంకటేశ్వరరావు , శ్రీను ,సాయిల సత్యనారాయణ ,మల్లికార్జున రావు ,శేఖర్ ,గిరి ,పుల్లారావు , శ్యాం ,మోహన్ రావు , శ్రీను , నాక్కబోయన బాబు ,కురేష్ తదితరులు ఉన్నారు)
అనంతరం గుమ్మడివల్లి పెద్దవాగు ప్రాజెక్ట్ ను సందర్శించారు….అక్కడ రైతులతో మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడారు ఈ సందర్భంగా రైతులు మెచ్చా తో మాట్లాడుతూ భావోద్వేగానికి గురి అయ్యారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కనీసం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అడిగిన వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి గేట్లు దింపించడం పట్ల మెచ్చా కి కృతజ్ఞతలు తెలియజేసారు రైతులు….ఈ సందర్భంగా మెచ్చా మాట్లాడుతూ 3సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద వాగు ప్రాజెక్ట్ గురించి పాటించుకోవడం లేదని.గొప్పలు చెప్పుకునే వారు కన్నెత్తి కూడా ప్రాజెక్ట్ వైపు చూడడం లేదని. సుమారు 3కోట్లతో రింగ్ బండ ఏర్పాటు చెయ్యడంలో అవినీతి జరిగిందని ఆరోపించారు.రైతు ఏడ్చిన రాజ్యం బాగు పడ్డట్టు చరిత్రలో లేదని అన్నారు.
5)- ఆసుపాక(గ్రామం)లో పాయం కన్నయ్య ఇటీవలే స్వర్గస్థులు అవ్వడంతో వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. అదే గ్రామంలో ఉప్పల మహేశ్వరరావు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారిని పరామర్శించారు.అలాగే దంతెనపల్లి సాయి ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడగా వారిని పరామర్శించారు.(నల్లపు చందర్ రావు ,తాళ్ళాడ వెంకటేశ్వరరావు ,మానేపల్లి రాజ్ కుమార్ ,ఎర్రంశెట్టి రమేష్ ,నాగేశ్వరరావు ,కొత్తపల్లి సుధాకర్ ,జొన్నగడ్డ రవీంద్ర ,పినబోయిన సత్య, బాయ్య సాయి ,తదితరులు ఉన్నారు)
6)- గాడ్రాల(గ్రామం)లో తాటి ముత్యాలు ని పరామర్శించారు. (సర్పంచ్ పండా రాజులు ,కాకా మధు ,రాము ,తదితరులు ఉన్నారు)
7)- తిరుమలకుంట(గ్రామం)లో కక్కిరాల నాగేశ్వరరావు ఓపెన్ సర్జరీ చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారిని, పానుగంటి లక్ష్మణ్ రావు తండ్రి వారిని, తాటి నాగేశ్వరరావు ని పరామర్శించారు.
8)- కొత్తమామిల్లవారిగూడెం(గ్రామం),లో రామినేని వెంకట మహేశ్వరరావు కుమారుడు ఆదిత్యా ఇటీవలే స్వర్గస్థులు అవ్వడంతో వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.అనంతరం మాజీ ఎంపీపీ సింగలదేవి జానకి రమణ భర్త ఇటీవలే స్వర్గస్థులు అవ్వడంతో వారి కుటుంబసభ్యులను పరామర్శించారు..అలాగే ఇస్టిని శ్రీనివాస్ రావు కుమారుడు ప్రశాంత్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా వారిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని కాంక్షించారు.(తాండ్ర యుగంధర్ , కోర్స ప్రతాప్ ,నరేష్ ,పెద్ద సత్యనారాయణ ,sk రెహ్మాన్ , వన్నం బాబురావు ,పుల్లారావు ,ఉప్పల రత్నాకర్ తదితరులు ఉన్నారు)
9)- గుర్రాలచెరువులో కంభంపాటి వీరయ్య ఆరోగ్య పరిస్థి బాగాలేనందున వారిని,కలపాల రాంబాబు అనారోగ్యంతో బాధపడుతుండగా కలపాల పుల్లారావు అనారోగ్యంతో బాధ పడుతుండగా వారిని పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి జూపల్లి రమణారావు , మాజీ ఎంపీపీ. జల్లిపల్లి శ్రీరామమూర్తి , మోహన్ రెడ్డి , యుఎస్ ప్రకాశ్ రావు , సంక ప్రసాద్ , కలపాల బాబురావు , ఉప సర్పంచ్ పాకనాటి నాగేశ్వరరావు , మాజీ సర్పంచ్ నారం రాజ్ శేఖర్ , సంకుల స్వరూపా , శ్రీదేవి , ఏలేటి పార్వతి , కలపాల సురేష్ , ఆసిఫ్ , ఆరేపల్లి రాంబాబు , చిప్పనపల్లి శ్రీను , ధర్మా , లింగంకుంట కృష్ణ , బుజ్జి బాబు , అలా లింగేశ్వర రావు,ఆకుల శ్రీను , చిన్నంశెట్టి రాంబాబు , నారాయణ , జజ్జూరపు రాంబాబు , దుర్గా రావు , నార్లపాటి వెంకన్న బాబు , నందికొల్ల వెంకన్న బాబు , తుంపాటి రమేష్ , నార్లపాటి వెంకటేశ్వరరావు,దిలీప్ , అమీర్ , నార్లపాటి బన్ను,నార్లపాటి ప్రదీప్ , నాగు తదితరులు ఉన్నారు.


