మహిళల సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…
18వ డివిజన్‌లో ఘనంగా గోరింటాకు, వనభోజనాల కార్యక్రమం…
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి,రామగుండం/ : రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆశీస్సులతో 18వ డివిజన్ మహిళలకు గోరింటాకు, వనభోజనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రామగిరి మండలం బగుళ్ల దేవస్థానం సమీపంలో 18వ డివిజన్ కార్పొరేటర్ దేవనపల్లి చక్రపాణి–స్వప్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమానికి రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ముఖ్యఅతిథిగా హాజరై మహిళలతో కలిసి గోరింటాకు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మహిళలతో కలిసి వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 18వ డివిజన్ మహిళలు ఆటపాటలు, సాంస్కృతిక నృత్యాలతో సందడి చేస్తూ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ముఖ్యఅతిథి మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలలో ఐక్యత, ఆత్మీయతను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో 8వ కాలనీ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్, 18వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు భారతి, కాంగ్రెస్ నాయకులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


