పల్లెల్లో బెల్టు షాప్ జోరు..!
పేరుకే కిరాణం..అమ్మేదంత మధ్యమే.. మొద్దు నిద్రలో ఎక్సైజ్ శాఖ
అశ్వారావుపేట సాక్షిత : అశ్వారావుపేట నియోజకవర్గంలోని మండల పరిధిలో గల గ్రామాలలో బెల్ట్ షాప్ ల వల్ల కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. మద్యానికి బానిసై యువత కుటుంబ పెద్ద చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు.. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం బెల్టు షాపులను నిర్మూలిస్తున్నామని చెబుతున్న సంబంధిత అధికారులు మాత్రం. పెడచెవిన పెడుతున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో అన్ని గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంటే మద్యం మాఫియా మాత్రం అన్ని గ్రామాలలో బెల్టు షాపులు విచ్చలవిడిగా నడిపిస్తున్నారు. ఒక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినా అశ్వారావుపేటలోనే 100కు పైగా ఉంటే మిగతా ఒక్కో గ్రామంలో సుమారు 5 లేదా అంతకంటే ఎక్కువే బెల్టు షాపులు ఉన్నాయి.నిత్యం బెల్టు షాపుల యజమానులు జోరుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. బెల్ట్ షాపుల నిర్వాహకులు మద్యం ఆశ చూపి యువతను చెడు మార్గంలో వెళ్లే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఉదయం 5 గంటల నుండి మొదలుకొని అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ బెల్ట్ షాపుల దందా కొనసాగుతుంది. పల్లెల్లో ఈ బెల్ట్ షాపుల బారిన పడి కుటుంబాలు మొత్తం నాశనం అవుతున్నాయి.
పేరుకే కిరాణం..అమ్మేదంత మధ్యమమే
గ్రామాల్లో కిరాణ దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో తెల్లవారే వరకు బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. దాంతో చుట్టుపక్కల ఉన్న వారికీ కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంకా గ్రామంలోపలికి
వెళ్తే కిరాణ దుకాణాల్లో,సొంత ఇళ్లల్లో పెద్ద పెద్ద ఫ్రిజ్లు పెట్టుకొని మరీ విక్రయిస్తున్నారు. మద్యం మత్తులో అక్కడే ఇళ్ల మధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కిరాణ దుకాణాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తూ జనాల దగ్గర బాగానే డబ్బులు సంపాదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
మొద్దు నిద్రలో ఎక్సైజ్ శాఖ…
అశ్వారావుపేట నియోజకవర్గం మండల పరిధిలోని గ్రామాలలో మద్యం ఏరులై పారుతున్న ఎక్సైజ్ శాఖకు కనీసం కనువిప్పు కూడా కలగడం లేదు. మామూళ్ల మత్తులో తేలియాడుతూ ఎవరు ఏమైపోతే
తమకేమిటి తమకు నెలకు మామూలు వస్తే చాలు అన్నట్లుగా ఎక్సైజ్ అధికారులు ప్రవర్తిస్తున్నారు. అని ప్రజలు వాపోతున్నారు. గ్రామాలలో మద్యాన్ని నిర్మూలించాల్సిన ఎక్సైజ్ అధికారులు మొద్దు నిద్రలో తమకేమీ పట్టనట్లుగా ఉంటున్నారని గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో తేలి ఆడుతున్న ఎక్సైజ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బెల్ట్ షాపులను నియోజకవర్గ లోని మండలాల వ్యాప్తంగా మూయించాలని పలు గ్రామాలలోని ప్రజలు స్వచ్ఛందంగా కోరుతున్నారు.


