ప్రజల ముంగిటకు టీడీపీ – గురిజేపల్లిలో గూడూరి ఎరిక్షన్ బాబు ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం

Sakshitha news

ప్రజల ముంగిటకు టీడీపీ – గురిజేపల్లిలో గూడూరి ఎరిక్షన్ బాబు ఇంటింటికి తెలుగుదేశం ప్రచారం

యర్రగొండపాలెం మండలం గురిజేపల్లి గ్రామంలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొని గ్రామ ప్రజలను ఆప్యాయంగా కలుసుకున్నారు.

ఇంటింటికీ వెళ్లి ప్రజలతో నేరుగా మమేకమవుతూ తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించి, పార్టీ కరపత్రాలను అందజేశారు. అదే సమయంలో ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

అనంతరం నిర్వహించిన గ్రామ సమావేశంలో గత రెండేళ్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, యర్రగొండపాలెం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ పథకాలపై గ్రామ ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగల్ రెడ్డి , మండల నాయకులు, గురిజేపల్లి గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top