ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన వారాల వినోద్ కుమార్
కుత్బుల్లాపూర్,
నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీక, తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ముద్దుబిడ్డ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ఘన నివాళులు అర్పించారు.
జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధననే లక్ష్యంగా, ఏకైక ఎజెండాగా చేసుకుని ఉద్యమించిన మహనీయుడు జయశంకర్ సార్ అని వారాల వినోద్ కుమార్ కొనియాడారు.
భవిష్యత్ తరాలకు జయశంకర్ సార్ స్ఫూర్తిని అందించాలనే సంకల్పంతో ఆయన జీవిత విశేషాలను పాఠ్యపుస్తకాల్లో చేర్చిన ఘనత BRS అధినేత, మాజీ ముఖ్యమంత్రి KCR గారిదే అని అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి, భూపాలపల్లి జిల్లాకు ఆయన పేరును నామకరణం చేయడంతో పాటు, ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.
జయశంకర్ సార్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన చూపిన మార్గంలో పయనించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారాల వినోద్ కుమార్ తన కార్యాలయంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో BRS కార్యకర్తలు, గట్టు అశోక్ లక్ష్మణ్ రాజు యాదవ్ బాలస్వామి రమేష్ యాదవ్ జగన్ మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


