మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ వైస్ చైర్మన్‌గా దస్తగిరి ఖాన్ నియామకం

Sakshitha news

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ వైస్ చైర్మన్‌గా దస్తగిరి ఖాన్ నియామకం ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం : మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ వైస్ చైర్మన్‌గా దస్తగిరి ఖాన్ నియమితులైన సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ని వారి నివాసంలో కలిసి నియామక పత్రాన్ని అందుకున్నారు.

అనంతరం దస్తగిరి ఖాన్, హన్మంతన్న ని శాలువాతో సత్కరించి ఆశీస్సులు పొందారు. హన్మంతన్న శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతం, మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మహాదేవపురం డివిజన్ అధ్యక్షులు సిద్ధనోళ్ల సంజీవరెడ్డి , TPCC మైనారిటీ డిపార్ట్‌మెంట్ స్టేట్ జాయింట్ కన్వీనర్ సమీర్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వలి భాయ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top