జయశంకర్ ఆశయాల సాధనకు యువత పని చెయ్యాలి

Sakshitha news

జయశంకర్ ఆశయాల సాధనకు యువత పని చెయ్యాలి : సర్పంచి లిక్కి గురవమ్మ …


సాక్షిత :తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని గ్రామ సర్పంచి లిక్కి గురవమ్మ వెంకటయ్య అన్నారు. మండల పరిధిలోని తొగర్రాయి గ్రామపంచాయతీ కార్యాలయం నందు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఏ లక్ష్యంతో తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యాలను అమలు చేసుకునే బాధ్యత కూడా నేటి యువతపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి అమరబోయిన ఉమామహేశ్వరి శ్రీనివాసరావు, కార్యదర్శి రవీందర్ రెడ్డి, బిల్ కలెక్టర్ కరుణాకర్, గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top