కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి…..
సాక్షిత : సూర్యాపేట జిల్లా కోదాడ కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్.జి. హదాసరాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన బలాన్ని అందించిన మహనీయుడుగా, తెలంగాణ జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పొందారని ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ సేవలను జ్ఞాపకం చేసుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల గ్రంథాలయ శాస్త్ర అధ్యాపకులు మాతంగి యాకోబ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి మేధోబలాన్ని అందించిన గొప్ప విద్యావేత్త, ఆర్థికవేత్త, దూరదృష్టి గల ఆలోచనాపరుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు.అదేవిధంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ చందా అప్పారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం స్వాభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు నిర్మలా కుమారి, యాదమ్మ, బాలరాజు, భవాని,జ్యోతి, రమా, వేణుగోపాల్,తదితరులు పాల్గొన్నారు.


