క్లాత్ మార్కెట్ 46వ వార్షికోత్సవ ఘనంగా వేడుకలు.. పాల్గొన్న కావలి ఎమ్మెల్యే

Sakshitha news

కావలి పట్టణం అరుణోదయ క్లాత్ మార్కెట్ 46వ వార్షికోత్సవ ఘనంగా వేడుకలు.. పాల్గొన్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

కావలి,
ఆగస్టు:06

కావలి పట్టణంలోని అరుణోదయ క్లాత్ మార్కెట్ 46వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా గురువారం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, అరుణోదయ క్లాత్ మార్కెట్ మరింత అభివృద్ధి చెందాలని, వ్యాపారులు సుఖసంతోషాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

అలాగే కావలి ప్రజలందరూ ఆరోగ్యంగా,ఆనందంగా,ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ వ్యాపారులు,నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వ్యాపార వర్గాల ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top