ఇది మెగా డీఎస్సీ కాదు దగా డిఎస్సి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
నాయుడుపేట
తిరుపతి జిల్లా నాయుడుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై రిలే నిరాహార దీక్షలు చేశారు.
డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు.
నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సూళ్లూరుపేట ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.
స్పోర్ట్స్ కోటా పేరుతో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విచారణ పూర్తయ్యే వరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను పదవి నుంచి తప్పించాలని కోరారు.
అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డీఎస్సీ అక్రమాల బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని సంజీవయ్య స్పష్టం చేశారు


