మొక్కలే మానవాళికి మనుగడకు ప్రాణాధారం

Sakshitha news

మొక్కలే మానవాళికి మనుగడకు ప్రాణాధారం – మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి


*గజ్జలకొండలో ‘నెట్ జీరో ఆరోగ్యకరమైన ప్రాంగణం’ కార్యక్రమం: మొక్కలు నాటిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి , కలెక్టర్ విజయ్ సునీత


మార్కాపురం జిల్లా :
మార్కాపురం పరిధిలోని గజ్జలకొండలో 2026–27 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ‘నెట్ జీరో ఆరోగ్యకరమైన ప్రాంగణం’ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ సునీతతో కలిసి ఆయన మొక్కలు నాటారు. వీబీ జీ రామ్ జీ – ఉద్యానవన పెంపకం కార్యక్రమంలో భాగంగా ఈ “అతి అధిక సాంద్రతతో మొక్కల పెంపకం” (Ultra High Density Plantation) కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం మరియు నీటి సంరక్షణలో మొక్కల పెంపకం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను పెంచే ఈ నూతన ‘అతి అధిక సాంద్రత’ విధానం ద్వారా పచ్చదనాన్ని వేగంగా విస్తరించవచ్చని పేర్కొన్నారు. “ఈ రోజు పచ్చదనం – రేపటి మెరుగైన భవిష్యత్తు” అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించి, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top