భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పాదయాత్ర

Sakshitha news

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 6 తేదీ నుండి 14వ తేదీ వరకు పాదయాత్ర

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)

సూళ్లూరుపేట

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 6 తేదీ నుండి 14వ తేదీ వరకు జరుగు పాదయాత్రలో భాగంగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సూళ్లూరుపేట పట్టణంలోని
సాయి నగర్ సరసమ్మ కథ చిన్న సత్రం లోపాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్ర ఉద్దేశించి నియోజకవర్గం కార్యదర్శి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ధర్మం నియంత్రించ లేకపోవడం సార్వత్రిక విద్యను అందుబాటులోకి తేవకపోవడం నీటి పరీక్షలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అయినందువలన వీటిని ప్రశ్నించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి తొత్తులా మాట్లాడడం ఇది సౌభయం కాదని తెలిపారు. అదే విధంగా సాయి నగర్ లోనే గిరిజన కాలనీలకు రోడ్లు, త్రాగునీరు మౌలిక వసతులు కల్పించాలని ఈ నెల 14వ తేదీ ఆర్డిఓ ఆఫీస్ నందు స్థానిక సమస్యలపై ధర్నా నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కే శ్రీనివాసులు, నాగేంద్ర, సిపిఐ పట్టణ కార్యదర్శి ఈ ఆనంద్ బాబు సహాయ కార్యదర్శులు బాలు లక్ష్మీ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి బాలయ్య మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు డి చెంచమ్మ సీనయ్య కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top