ఆర్డీవో స్థాయిలో ప్రజావాణి అవసరం లేదు
మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రజావాణిలు చాలు……..
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి
సాక్షిత వనపర్తి
రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) స్థాయిలో ప్రజావాణి నిర్వహణ అవసరం లేదని, మండలం, జిల్లా, రాష్ట్రస్థాయి ప్రజావాణిలు మాత్రమే ఉండాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఆర్డీవో కార్యాలయాలు దాదాపుగా కలెక్టరేట్ లోనే ఉంటాయని, లేదంటే చుట్టుపక్కల ఉంటాయని, అలాంటప్పుడు మండలం, జిల్లాస్థాయి ప్రజావాణిల మధ్యలో ఆర్డీవో స్థాయిలో ప్రజావాణి నిర్వహణ అవసరం లేదని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్లానింగ్ శాఖ ఉన్నతాధికారులు పునరాలోచన చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చిన్నారెడ్డి సూచించారు.


