కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో సైబర్ నేరాల పై అవగాహనాసదస్సు ……………చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ..
సాక్షిత : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ డిప్యూటీ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ – (డీఎస్పీ) ఆర్. శ్రీనివాస రెడ్డి పాల్గొని విద్యార్థి నులను ఉద్దేశించి మాట్లాడుతూ, సైబర్ నేరగాళ్ళు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ మరియు కంప్యూటర్స్ ఉపయోగించి విద్యార్థినులను మోసం చేసి, వారి వ్యక్తి గత సమాచారాన్ని దొంగిలించటం జరుగుతుంది అని, సైబర్ నేరాల పై విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని తెలియచేసారు. కోదాడ సర్కిల్ ఇన్స్పెక్టర్- కే. శివ శంకర్ మాట్లాడుతూ,విద్యార్థి నులు సామాజిక మాధ్యమాలైన పేస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సప్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థినులకు సూచించారు.
కోదాడ ట్రాఫిక్ సబ్ -ఇన్స్పెక్టర్ అంజి రెడ్డి మాట్లాడుతూ , రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మరియు ప్రాణాలను రక్షించడానికి ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు చరవానిలను వినియోగించకూడదని విద్యార్థి నులకు చూచించారు.కోదాడ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ – జి. అజయ్ కుమార్ మాట్లాడుతూ , విద్యార్థి నులు, నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్ తో,
విద్యార్థినులను బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుందని, అటువంటి నకిలీ ఖాతాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక పోలీస్ అక్క మీనా మాట్లాడుతూ, విద్యార్థినులు రక్షణ చట్టాలపై అవగాహనా కల్పించుకోవాలని, విద్యార్థి నులకు ఇటువంటి సమస్యలు ఎదురైనా పోలీస్ అక్కను సంప్రదించవచ్చని సూచించారు.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.


