ద్వారకుంటలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

Sakshitha news

ద్వారకుంటలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు…*

సాక్షిత : సూర్యపేట జిల్లా/ కోదాడ మండలం ద్వారకుంట గ్రామంలో అమ్మ పాలు అమృతంతో సమానం ముర్రుపాలలో వ్యాధి నిరోధక శక్తి అధికం. అమ్మ పాలు అమృతంతో సమానమని తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమని ముర్రుపాల లోనే వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని అది బిడ్డకు శ్రీరామరక్ష అని సర్పంచ్ పాలకి సురేష్ అన్నారు. మండల పరిధిలోని దోరకుంట గ్రామంలో అంగనవాడి 1, 2,3,4 కేంద్రాలలో
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పుట్టిన రోజు వేడుక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ పాలకి సురేష్, ఏసిడిపిఓ కిరణ్మయి అంగన్వాడి సూపర్వైజర్ రమణ లు పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు.

బిడ్డ పుట్టిన గంట లోపు వచ్చే మురుపాలలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల బిడ్డ ను అనేక వ్యాధుల నుండి. రక్షిస్తాయని అన్నారు. కాన్పు జరిగిన గంటలోపే తప్పనిసరిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఇతర పానీయాలు ఏవి పట్టవద్దు అని తెలిపారు. ఆరు నెలలు నిండినటువంటి పిల్లలకి సిబిఈ ఈవెంట్లో భాగంగా అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అందించే అవకాశాలను తల్లులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు 1-3 సంవత్సరాల పిల్లలకు బాలామృతము ఎనిమిది గుడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రమాదేవి, వార్డు నెంబర్లు జాను,గ్రామ కార్యదర్శి జి వెంకటేశ్వర్లు అంగన్వాడి టీచర్లు ఆదిలక్ష్మి, కృష్ణవేణి, అరుణ,నాగమణి , ఆయా ఆశాలు గర్భవతులు తల్లులు గ్రామ పెద్దలు ప్రతిపాక వెంకటేశ్వర్లు, పత్తిపాక రామ్మూర్తి నాగేంద్రబాబు లింగం సైదులు, తదితరులు పాల్గొన్నారు .

Scroll to Top