ఆత్యవసర వైద్య విధానాలఫై అవగాహన, మరియు కావలి డివిజన్ పీఎంపీ అసోసియేషన్ ఎన్నికలు
కావలి,అమరావతి జ్యోతి;
కావలి డివిజన్ కమ్యూనిటీ పారా మెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రోవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పీఎంపీ అసోసియేషన్ అఫ్ ఇండియా )ఆధ్వర్యంలో కావలి రామూర్తి పేట ఆనంద్ హాస్పిటల్ నందుకావలి డివిజన్ పీఎంపీ అసోసియేషన్ కన్వీనర్ పీవీ.రమణయ్య అధ్యక్షతన,రాష్ట్ర కోశాధికారి శాఖ మూరి వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోరంట్ల శేషయ్యముఖ్య అతిధులు ఎన్నికల పర్యవేక్షకులుగా డాక్టర్ కె.కుమార్ గౌరవ అతిధిగ,మరియు కావలి డివిజన్ పీఎంపీ సభ్యులు హాజరైనారు.
కావలి డివిజన్ కమ్యూనిటీ పారా మెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ సభ్యులతో అత్యవసర వైద్య విధానం ఫై అవగాహన కార్యక్రమంజరిగింది.
జనరల్ మరియు జీర్ణకొశ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ కె.ఆనంద్ కుమార్ ప్రసంగిస్తు,గ్రామీణ ప్రాంతప్రజలకు వైద్య సేవలు అందించే గ్రామీణ వైద్యులు,వారి పరిధిలో ఎన్నో వైద్య సేవలు, సేవా భావంతోఅందిస్తున్నారని,అత్యవసర పరిస్థితుల్లో వారి సేవలు అమోఘమని వారిని అభినందనలు తెలుపుతున్నామని , మీ ప్రాంతంలలోఅత్యవసరముగ ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చూపులో మార్పులు మాట తడబడటం, అధిక రక్త పోటు, చేయికాలు, బలహీన పడటం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అత్యవసరముగ, ఉన్నత వైద్య శాలలకు తరలించి మెరుగైన వైద్యం అందించి వారిలో ఆత్మ స్టైర్యం,భరోసా కలిగించాలని సలహా ఇచ్చారు..
తదుపరి కావలి డివిజన్ పీఎంపీ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి అధ్యక్షులు పీవీ రమణయ్య, కార్యదర్శి O. మస్తానయ్య,ఉపాధ్యక్షులు యైవి..చలపతి రావు, ఉపకార్య దర్శి యం. దయాకర్, కోశాది కారి షేక్. జీలాని బాష,గౌరవ సలహాదారులుగ,స్వచ్చంద సంస్థలగౌరవ అధ్యక్షులుషేక్. ఖాదర్ బాష,ఆర్.అంకమనాయుడు, సామాజికకార్యకర్త, ఎం. మాలకొందారెడ్డి లును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, ఏకగ్రీవంగా ఎన్నికయినా సభ్యులను ఘనంగా సత్కరించి వారిచేత, హర్ష ధ్వనులమధ్య ప్రమాణస్వీకారంచేయించడంజరిగింది.ఫైకార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్ సభ్యులువిరివిగపాల్గొని విజయవంతం చేయడమైనది ,


