కమలాపురం నియోజకవర్గంలోని దేవరాజుపల్లె గ్రామంలో ఉటుకూరు వ్యవసాయ పరిశోధనా స్థానం, బద్వేలు వ్యవసాయ కళాశాల మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఎల్ నినోపై అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి హాజరయ్యారు.
కమలాపురం మండలంలోని వివిధ రైతు సేవా కేంద్రాల పరిధిలో ఎల్ నినో అవగాహన సదస్సు, క్షేత్ర సందర్శన నిర్వహించారు.
ఎల్ నినో వల్ల వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే శాస్త్రవేత్తలను కోరారు. అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారవంతం పెరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆర్టికల్చర్ సంబంధిత అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు


