దుండిగల్ గాగిలాపూర్ తాండ–2లో ఘనంగా నిర్వహించిన శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాల మహోత్సవాల్లో

Sakshitha news

దుండిగల్ గాగిలాపూర్ తాండ–2లో ఘనంగా నిర్వహించిన శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాల మహోత్సవాల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని గాగిలాపూర్ తాండ–2 లో ఘనంగా నిర్వహించిన శ్రీశ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి బోనాల మహోత్సవాలకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. అమ్మవారి కృపతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మైసిగారి శ్రీనివాస్, సిద్ధునోళ్ల సంజీవ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోట్ల విజయ్ కుమార్, కె. భిక్షపతి నాయక్, ఎల్. శ్రీను నాయక్, డి. రాజు నాయక్, డి. నెహ్రూ నాయక్, కె. హనుమంతు నాయక్, ఎల్. ప్రేమ్ సింగ్ నాయక్, టి. శ్రీను నాయక్, కె. ప్రవీణ్ నాయక్,కె. కన్నా నాయక్, ఆర్. కుమార్ నాయక్, కె. స్వామి నాయక్, డి. గణేష్ నాయక్, జె. నరేందర్ నాయక్, కె. మదన్ నాయక్, డి. విజయ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top