నిరుపేద వీధి వ్యాపారుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం..!

Sakshitha news

నిరుపేద వీధి వ్యాపారుల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం..!

ఎన్నో ఏళ్లుగా రోడ్డు పక్కన చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న నిరుపేద వీధి వ్యాపారుల జీవనాధారాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోంది. ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా చిన్న వ్యాపార సముదాయాలను కూల్చివేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఉదయం TSIIC కాలనీ నుండి రాజీవ్ గాంధీ నగర్ వరకు ఉన్న వీధి వ్యాపార సముదాయాలను CMC టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తుండగా, వెంటనే CMC డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ సంఘటన స్థలానికి చేరుకుని అధికారులను నిలదీశారు.

అనంతరం ఈ విషయాన్ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దృష్టికి తీసుకెళ్లి, స్థానికంగా బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కనీసం రెండు వారాల పాటు కూల్చివేతలను నిలిపివేసి, వీధి వ్యాపారులకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీ కేపీ వివేకానంద టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడి, తాత్కాలికంగా కూల్చివేతలను నిలిపివేయించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్ యాదవ్ , డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ , రుద్ర అశోక్ , ఇస్మాయిల్ , జై కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top