రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..

Sakshitha news

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..


చిలుకూరు సాక్షిత
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రం కోదాడ జడ్చర్ల నేషనల్ హై వే పై చిలుకూరు మండలం సీతారామపురం స్టేజి సమీపంలో ద్విచక్ర వాహనం బోలేరో ఢీ కొని ఒకరు మృతి . మరొకరికి తీవ్ర గాయాలు, పరిస్థితి అత్యంత విషమం.
మృతుడు మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన భూక్య నరసింహ (19) ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తుండగా సీరియస్ గా ఉన్న మరో వ్యక్తి భోజ్య తండా కు చెందిన గుగులోతు గోపి రాములు అలియాస్ కొండ గా గుర్తించారు . స్థానికులు 108 ద్వారా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన డాక్టర్ భూక్య నరసింహ మృతి చెందాడని నిర్దారించారు . గుగులోతు గోపి రాములు ఆరోగ్య పరిస్తితి అత్యంత విషమం గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.

Scroll to Top