సమ్మక్క–సారక్క ప్రసాదం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కు అందజేత…..
ఎమ్మెల్యే కు శాలువాతో ఘన సత్కారం చేసిన కాంగ్రెస్ కార్పొరేటర్లు…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని, : సమ్మక్క–సారక్క వనదేవతలను దర్శించుకుని వచ్చిన రామగుండం నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అమ్మవార్ల ప్రసాదాన్ని అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ, సమ్మక్క–సారక్క వనదేవతల ఆశీర్వాదాలు రామగుండం నియోజకవర్గ ప్రజలపై, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులు, వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి మరింత శక్తి, విజయాన్ని ప్రసాదించాలని వనదేవతలను వేడుకున్నట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నాయకత్వంలో రామగుండం నియోజకవర్గ అభివృద్ధిలో తాము భాగస్వాములమై పనిచేస్తామని, ప్రతి డివిజన్ అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామని కార్పొరేటర్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధికి ఎమ్మెల్యే అందిస్తున్న సహకారం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గంలోని పలు డివిజన్ల కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
