శాకాంబరి అలంకరణలో వాసవి అమ్మవారు

Sakshitha news

శాకాంబరి అలంకరణలో వాసవి అమ్మవారు

పల్లకి సేవలో వాసవి అమ్మవారు

కోవూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం వాసవి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రధానార్చకులు నందకిషోర్ సమక్షంలో శాకాంబరి అలంకరణలో అమ్మవారు. ముందుగా అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో అలంకరించి పూజలు, నైవేద్యాలు, మంగళ హారతులు సాంప్రదాయబద్ధంగా సమర్పించారు. అనంతరం పల్లకి సేవ మంగళ వాయిద్యాలతో, మేళతాళాలతో, అంగరంగ వైభవంగా జై వాసవి మాత నామ స్మరణతో జరిగింది. వచ్చిన భక్తులందరూ అమ్మవారి ని దర్శించుకుని పుణ్యహితులు అయ్యారు. అనంతరం ప్రతి ఒక్కరికి ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ సి.హెచ్ వెంకటేశ్వర్లు, సెక్రెటరీ యస్. రమేష్ బాబు, కోశాధికారి మెంటా రమేష్ బాబు, మరియు వాసవి మహిళా కోలాట భక్త బృందం, తదితరులు పాల్గొనడం జరిగింది.

Scroll to Top