ప్రతి ఇంటా ఇంకుడు గుంత.. ప్రతి నీటి బొట్టూ భూగర్భానికి – ప్రజలు భాగస్వాములు కావాలి….
మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ జె. అరుణ శ్రీ….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, : భూగర్భ జలాల మట్టం పెంపొందించేందుకు రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంత (రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్) నిర్మించుకోవాలని నగర మేయర్ మహంకాళి స్వామి, మున్సిపల్ కమిషనర్ జె. అరుణ శ్రీ ప్రజలకు పిలుపునిచ్చారు.
విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ, నివాస గృహాలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు తదితర అన్ని భవనాల్లో వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
భవన నిర్మాణ అనుమతి సమయంలో ఇంకుడు గుంత నిర్మాణానికి సంబంధించి డిపాజిట్ రూపంలో చెల్లించిన రుసుమును, నిర్మాణం పూర్తిచేసి ఫోటోలు, వివరాలు సమర్పించిన అనంతరం పూర్తిగా తిరిగి చెల్లించడం జరుగుతుందని తెలిపారు.
జల్ సంచయ్ జన భాగీదారి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును భూగర్భంలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని, ప్రజలు స్వచ్ఛందంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే ఏర్పాటు చేసిన వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను శుభ్రపరచి సక్రమంగా పనిచేసేలా నిర్వహించుకోవాలని సూచించారు.
నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరిగితే భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు భావితరాలకు నీటి వనరులు అందుబాటులో ఉంటాయని మేయర్, కమిషనర్ పేర్కొన్నారు.
అంకితభావంతో, క్రమశిక్షణతో, గైర్హాజరు కాకుండా సేవలందించిన పంగ దేవయ్యను సహచర ఉద్యోగులు ప్రశంసించారు. ఆయన సేవలు నగర పాలక సంస్థకు ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ శ్రీ పాల్, జూనియర్ అసిస్టెంట్ నాయిని చంద్రారెడ్డి, సానిటరీ జవాన్ సూర్యతో పాటు నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
