అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత బొచ్చు శంకర్‌కు ఘన సన్మానం….
సామాజిక సేవ, కార్మికుల సంక్షేమానికి చేసిన కృషికి ప్రశంసలు….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్జీ-3 బ్రాంచ్ కార్యదర్శి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా సీనియర్ నాయకుడు బొచ్చు శంకర్‌కు ఎయిట్ ఇంక్లైన్ కాలనీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన సన్మానం నిర్వహించారు.
ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కో-కన్వీనర్ ఆకునూరి బాలంకూస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస రాజేష్, ఏఐటీయూసీ కేంద్ర కమిటీ నాయకుడు కందుకూరి రాజారత్నం బొచ్చు శంకర్‌కు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, దళిత, బహుజన, అణగారిన వర్గాల అభ్యున్నతితో పాటు సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బొచ్చు శంకర్ అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డుతో సత్కరించడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్‌తో పాటు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ద్వారా బొచ్చు శంకర్ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని అభినందించారు.
ఈ కార్యక్రమంలో శనిగరపు పోచయ్య, బైరం సదానందం, మేకల సురేష్, గుడిశాల రాజశేఖర్, పశువుల సురేష్, బొల్లి మల్లేష్, ఎల్లావుల రాములు, వేముల శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, నీలం మదన్మోహన్, పాముల నాగేశ్వరరావు, రామగిరి రమేష్, భోగే వెంకటేష్, సంగీ రవీందర్, మహమ్మద్ ఇషాక్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
