కోదాడ లొ గ్రంథాలయం చైర్మన్ కు వినతిపత్రం ఇస్తున్న పార్ట్ టైం స్పీకర్లు ..
పార్ట్ టైం స్లీపర్లకు జీతాలు పెంచాలి..
కోదాడ సాక్షిత :
సూర్యాపేట జిల్లా జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రంథాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం స్వీపర్లకు జీతాలు పెం చాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు కు పార్ట్ టైం స్వీపర్ల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లాలో వివిధ గ్రంథాలయాల్లో పనిచేసే పార్ట్ టైమ్ స్వీపర్స్ నేడు ఉన్న నిత్యవసరల వస్తువుల ధరలకు అనుగుణంగా తమ జీతాలను పెంచాలని, అదేవిధంగా తమ జీతాల పెంపుదల విషయమై, రాష్ట్ర గ్రంధాలయ డైరెక్టర్ కు లేఖను పంపవలసిందిగా చైర్మన్ కోరారు. దానికి సానుకూలంగా స్పందించి,లేఖను పంపుతానని చైర్మన్ గారు హామీ ఇచ్చారని వారన్నారు. కార్యక్రమంలో శ్రీ పళ్ళ సంఘం అధ్యక్షుడు హుస్సేన్ మధు, బోయిళ్ల శివ, కుడుములనాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
